కలం, జోగులాంబ గద్వాల: ఈనెల 24న జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలో వాల్మీకి ఎస్టీ సాధన సంకల్ప ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని నివిజయవంతం చేయాలని కోరుతూ గురువారం కే.టి.దొడ్డి మండలం వాల్మీకి సేవా సమితి, వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు కర్ణాటక రాష్ట్రం దేవదుర్గ ఎమ్మెల్యే కర్రెమ్మ చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కే.టి.దొడ్డి మండల వాల్మీకి సేవా సమితి, ఉద్యోగ సంఘం నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, గద్వాలలో జరిగే మహా ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

