కలం, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు (AP Local Body Elections) వాయిదా పడ్డాయి. ఈ మేరకు 99 పట్టణ, నగర స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 25న అభ్యర్థుల తుది జాబితా వెల్లడించనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో నాలుగు రోజుల పాటు అభ్యర్థుల తుది జాబితాను వాయిదా వేశారు. ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్ తేదీని నవంబర్ 1కి వాయిదా వేశారు. నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించి, 3న ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం మైదుకూరు పోలింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ రీషెడ్యూల్ ప్రకటనకు ముందే 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలుత కొన్ని స్థానాల్లో నిలిపివేయాలని భావించారు. కానీ, పలు కారణాలతో అన్ని స్థానాల్లో ఎన్నికలు నిలిపివేశారు.

