కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ థియరీ పరీక్షల (AP Inter Exams) షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 2027 ఫిబ్రవరి 24న పార్ట్-2 లాంగ్వేజెస్ పత్రంతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 1న మ్యాథ్స్/సివిక్స్ పేపర్-1, మార్చి 3న బయాలజీ/హిస్టరీ పేపర్-1, మార్చి 5న ఫిజిక్స్/ఎకనామిక్స్ పేపర్-1, మార్చి 9న కెమిస్ట్రీ/కామర్స్ పేపర్-1, మార్చి 15న మోడర్న్ లాంగ్వేజ్/జియోగ్రఫీ పేపర్-1తో మొదటి సంవత్సరం పరీక్షలు ముగుస్తాయి.
సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2027 ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పత్రంతో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2, మార్చి 2న మ్యాథ్స్/సివిక్స్ పేపర్-2, మార్చి 4న బయాలజీ/హిస్టరీ పేపర్-2, మార్చి 8న ఫిజిక్స్/ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 11న కెమిస్ట్రీ/కామర్స్ పేపర్-2, మార్చి 16న మోడర్న్ లాంగ్వేజ్/జియోగ్రఫీ పేపర్-2తో ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియనున్నాయి. పాత సిలబస్ విద్యార్థులకు, బ్యాక్‌లాగ్ అభ్యర్థులకు కూడా బోర్డు నిర్దిష్టమైన తేదీల వారీగా పరీక్షల వివరాలను వెల్లడించింది.
Also Read : జనసేనకు టీడీపీతోనే ముప్పు.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

