కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న (Panduga Sayanna) జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన ఆశయాలు, సేవాభావం యువతకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్ గణేష్, కార్పొరేటర్లు కిషోర్, రమేష్ నాయక్, శరత్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : కేసీఆర్ పాలనలో ఈ తిప్పలు లేవు: హరీష్ రావు
Follow Us On: Youtube

