ఒకే రోజు రెండు గోల్డ్స్‌.. శీతల్ అదుర్స్‌!

కలం, స్పోర్ట్స్​ : ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు.. భారత పారా ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియన్ పారా గేమ్స్‌లో గురువారం వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలోనూ బంగారు పతకం సాధించారు. అంతకుముందు మిక్స్‌డ్‌ టీమ్ ఈవెంట్‌లోనూ స్వర్ణం గెలిచారు. వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన నూర్ సయ్యదా అలిమ్‌తో శీతల్ తలపడ్డారు. ఆరంభంలో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా లక్ష్యాన్ని గురిచూసి ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించారు. చివరి రౌండ్‌లోనూ ఒత్తిడిని తట్టుకుని విజయం అందుకున్నారు.

అంతకుముందు తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం సాధించారు. ఫైనల్‌లో ఇండోనేషియా జోడీని ఓడించి భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. అయితే, శీతల్ ఈ పోటీల్లో తన ప్రయాణాన్ని రజత పతకంతో ప్రారంభించారు. బుధవారం మహిళల కాంపౌండ్ డబుల్స్‌లో పాయల్ నాగ్‌తో కలిసి ఫైనల్‌కు చేరారు. చైనాకు చెందిన జోడీ చేతిలో ఓడిపోవడంతో రజతంతో సరిపెట్టుకున్నారు. ఇలా ఒకే రోజు రెండు స్వర్ణాలు సాధించిన శీతల్ దేవి.. ఆసియన్ పారా గేమ్స్‌లో భారత్‌కు మరో మధుర విజయాన్ని అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>