జ‌న‌సేన‌కు టీడీపీతోనే ముప్పు.. బొలిశెట్టి కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్‌డెస్క్: ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మిలో సీట్ల‌ పంప‌కాల‌పై మాజీ జ‌న‌సేన నాయ‌కుడు బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ (Bolisetty Satyanarayana) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ, వైసీపీ తొత్తుల‌ను పార్టీలో చేర్పించి జ‌న‌సేన టికెట్లు ఇచ్చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో నిజ‌మైన జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు బొలిశెట్టి నేడు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కొద్ది రోజులుగా సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో ర‌క‌ర‌కాల ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు.

ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో పవన్ క‌ల్యాణ్ కోసం, జనసేన పార్టీ కోసం సిద్ధాంతపరంగా బలంగా పని చేస్తున్న నిజమైన పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వడం లేద‌న్నారు. జనసేన(Janasena)లో ఎప్పుడూ లేని వారిని పార్టీలోకి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చార‌ని మండిప‌డ్డారు. ఇది జ‌న‌సేన నేత‌ల‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని చెప్పారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ఖండించారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కుల‌కు, వీర మ‌హిళ‌ల‌కు బొలిశెట్టి (Bolisetty Satyanarayana) కీల‌క విజ్ఞప్తి చేశారు. ఇత‌ర పార్టీల నేత‌లను తీసుకొచ్చి సీట్లు కేటాయించి, పోటీలో నిల‌బెడితే జ‌న‌సేన నాయ‌కులు నిర్భయంగా ముందుకొచ్చి నామినేషన్లు వేసి ఎన్నికల్లో పాల్గొనాల‌న్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే కేడ‌ర్‌ను ప‌క్క‌న పెట్టొద్ద‌ని, పార్టీ బ‌ల‌మంతా కేడ‌ర్‌లోనే ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. జ‌న‌సేన‌కు టీడీపీ నుంచే ముప్పు పొంచి ఉంద‌ని బొలిశెట్టి అన్నారు. నియోజ‌కవ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల ద్వారా ఈ విష‌యాన్ని అధిష్టానానికి తెలియ‌జేయాల‌ని, అదే స‌మ‌యంలో త‌ప్ప‌కుండా నామినేష‌న్లు వేసి ఎన్నిక‌ల్లో పాల్గొని ప్ర‌జాస్వామ్యాన్ని బ‌తికించాల‌ని కోరారు.

Also Read : రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా సెటైర్లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>