మూలన పడేసిన జాతిపిత చిత్రపటం.. అధికారుల తీరుపై విమర్శలు

కలం, నిర్మల్: దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీకి ప్రభుత్వ కార్యాలయంలో అవమానం ఎదురైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటాన్ని (Mahatma Gandhi Portrait) గోడపై ఉంచాల్సిన చోట మూలన పడేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని గౌరవప్రదంగా ఉంచాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఓ మూలన నిర్లక్ష్యంగా పడేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడి చిత్రపటం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత ఎక్సైజ్ శాఖఅధికారులు స్పందించి మహాత్మా గాంధీ చిత్రపటాన్ని గౌరవప్రదమైన స్థానంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>