అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే తనయుడు అర్జున్ జాదవ్

కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి అయ్యప్ప ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే చిన్న కుమారుడు అర్జున్ జాదవ్ శాస్త్రోక్తంగా అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు తన కుటుంబంతో పాటు బోథ్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ప్రభాకర్ రెడ్డి, శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>