బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం : ఎంపీ అరవింద్

కలం, నిజామాబాద్ బ్యూరో : కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీతో టచ్ ఉందని బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారిందన్నారు. ఎల్ నినో ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉందని, ప్రకృతి వైపరీత్యాలకు రాజకీయాలతో ఏం సంబంధం అని ఎంపీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై అనుకూలంగా లేదని. ఇప్పటికే బీఆర్ఎస్ తో మంత్రాంగం కొనసాగిస్తుందనీ అరవింద్ ఆరోపించారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పసుపునకు క్వింటాల్ కు రూ.50 వేలు ధర కల్పిస్తామని, మరోసారి బాండ్ పేపర్ రాసి ఇస్తానని అరవింద్ హామీ ఇచ్చారు.

కాళేశ్వరం పేరుతో కేసీఆర్ దోపిడి :

తెలంగాణ రాష్ట్ర సంపదను కాళేశ్వరం (Kaleshwaram) పేరుతో కేసీఆర్ దోచుకున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. 2019 లో కాళేశ్వరాన్ని నింపగానే పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కాళేశ్వరం పై అప్పట్లో NDSA ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు ఆయన చేస్తోంది కూడా అదేనని ఆయన (MP Arvind) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవనగర్ ఆర్‌వోబీ అంచనా వ్యయం పెంపు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్ లో ఉంచుతోందని చెప్పారు. ఆర్‌వోబీ పనులపై రెండు రోజుల్లో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతుందని ప్రకటించారుక. ఆర్‌వోబీ విషయంలో ప్రభుత్వం మెడలు వంచుతామని అరవింద్ హెచ్చరించారు.

Also Read : కులగణనపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>