కులగణనపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్: కుల గణన(Caste Census)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఇంకా లెక్కల్లోని రాని బీసీలు ఎవరైనా ఉంటే వెంటనే ప్రభుత్వానికి వివరాలు అందించాలని సూచించారు. అవసరమైతే లెక్కలను మరోసారి సవరిస్తామన్నారు. ఏ వర్గానికి అన్యాయం జరగొద్దనేదే తమ ప్రభుత్వం ఆలోచన అన్నారు.

త్వరలోనే ఈ అంశంపై రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రవీంద్ర భారతిలో జరుగుతున్న పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ ఈ మేరకు ప్రకటన చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఎవరూ కుల గణన చేయలేదని.. తెలంగాణలో తమ ప్రభుత్వమే ఆ పని చేసిందన్నారు.

ముదిరాజ్‌లు అండగా ఉంటే..

ముదిరాజ్ జాతి గొప్పదని.. వారు అండగా ఉంటే ఎలాంటి అడ్డంకి అయినా అధిగమించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజ్ కులస్థులే అన్నారు. అలాంటి వారి ఆరాధ్య దైవం లాంటి పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వాలు ఆలోచించలేదన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తనకు ఈ విషయం చెప్పగానే.. వెంటనే నిర్వహించాలని ఆదేశించామన్నారు. భూస్వాములపై పోరాటం చేసి వారి సంపదను పేదలకు పంచిన గొప్ప వీరుడు పండుగ సాయన్న అన్నారు. చివరికి ఆయన్ను ఉరి తీశారని.. వందేళ్లయినా సాయన్న త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటున్నామని కొనియాడారు.

Also Read : బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం : ఎంపీ అరవింద్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>