మేడిగడ్డ బ్యారేజీ కూలడం వెనుక కుట్ర: ఆర్ఎస్ ప్రవీణ్​

కలం, వెబ్ డెస్క్: మేడిగడ్డ బ్యారేజీ కూలడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. మూడేళ్ల కిందటే తాము ఈ విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసినా.. ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కేసును అన్ డిటెక్టడ్ కేటగిరీలోకి చేర్చి మూసేశారని మండిపడ్డారు.

దీనిపై హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు. పిల్లర్లు కూలడానికి స్పష్టమైన కారణం చెప్పాలని రేవంత్ రెడ్డికి మరోసారి లేఖ రాస్తామన్నారు. ఆయన నిర్లక్ష్యం వలనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయన్నారు. పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

ఐఏఎస్ అధికారులు ఏం చేస్తారు..?

రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉంటే.. సమస్య ఏంటో చూడాలని ఐఏఎస్ అధికారులను పవర్ ప్లాంట్లకు పంపిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ ఎద్దేవా చేశారు. ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లు ఏం చేస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు, కరెంట్‌పై రోజూ మానిటరింగ్ చేసేవారని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన జేబుల్లోకి ఎంత డబ్బులు వచ్చాయనేది చూసుకుంటున్నారని విమర్శించారు. అవినీతిపరులను పెట్టేందుకు జైళ్లు కూడా సరిపోవడం లేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>