రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

కలం, వనపర్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడు సింగనమోని దినేష్‌ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నకొడుకును కోల్పోయిన తల్లిదండ్రులను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్‌ దేవాలయం పెట్రోల్ బంకు టర్నింగ్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దినేష్‌ మృతదేహాన్ని ఎమ్మెల్యే వనపర్తి ఏరియా ఆసుపత్రిలో సందర్శించారు. వనపర్తి మండలం మెట్టిపల్లి గ్రామానికి చెందిన శీను, సరిత దంపతుల కుమారుడైన దినేష్‌ అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పుత్రవియోగంతో విషాదంలో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఇదే ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న పెబ్బేరు పట్టణానికి చెందిన గణేష్‌ ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే (Megha Reddy) ఫోన్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. యువకుడి అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దినేష్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, గణేష్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>