కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddyని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
పోలీసుల తీరుపై ఎంపీ ఆగ్రహం..
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే స్వయంగా టీడీపీ నేతలకు కర్రలు, రాడ్లు అందించి వైసీపీ అభ్యర్థులపై దాడులు చేసేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తమ అభ్యర్థులు ఉదయమే నామినేషన్లు కేంద్రాల వద్దకు చేరుకున్నా.. 11 గంటల వరకు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

