వివాదాస్పద కంటెంట్, సెన్సేషనలిజంపై కేంద్రం కొరడా

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం (Centre Govt) వార్నింగ్ ఇచ్చింది. ప్రసార నిబంధనలను తప్పక పాటించాలని సమాచార మంత్రిత్వ శా అడ్వైజరీ జారీ చేసంది. ప్రోగ్రామింగ్, అడ్వర్టైజింగ్ కోడ్‌ను ఉల్లంఘించే ఛానెళ్లపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో కొన్ని టీవీ ఛానెళ్లలో సున్నితమైన అంశాలు, నేర పరిశోధనలు, కోర్టు పరిధిలోని అంశాలపై ప్రసారమవుతున్న కథనాలు సెన్సేషనలిజం వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అసత్యం, తప్పుదోవ పట్టించే సమాచారం ప్రసారం చేయడం, హింసను ప్రోత్సహించడంపై అభ్యంతరం తెలుపుతూ.. మార్గదర్శకాలను జారీ చేసింది. యాంటి టెర్రర్ ఆపరేషన్ల లైవ్ టెలికాస్ట్, సెన్సేషనల్ రిపోర్టింగ్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. టెలికాస్ట్ లో అధికార భారత మ్యాప్ ను మాత్రమే వాడలని ఆదేశించింది. లైంగిక దాడులకు సంబంధించి బాధితుల గుర్తింపును వెల్లడించకూడదని వెల్లడించింది.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే డిబేట్లు ప్రసార చేయకూడదని కేంద్రం (Central Govt) స్పష్టం చేసింది. అలాగే, కృత్రిమ మేధ (ఏఐ) వాడకంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ నిబంధనలు బేఖాతరు చేసే టీవీ ఛానెళ్ల లైసెన్స్‌ల రద్దు లేదా తాత్కాలిక నిలిపివేత వంటి చర్యలు తప్పవని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>