విషాదం.. బైక్‌‌పై నుంచి పడి యువకుడు మృతి

కలం, ఎర్రుపాలెం: ​ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం (Yerrupalem) మండలంలోని జమలాపురం రహదారి మలుపు వద్ద బుధవారం జరిగింది. ​ఎస్సై రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లపాలెం గ్రామానికి చెందిన వాకాదాని వీరబాబు (24) స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

మార్గమధ్యలో జమలాపురం మలుపు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి జారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కాగా, కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు పండగ పూట ప్రాణాలు కోల్పోవడంతో మృతుని కుటుంబ సభ్యులతో పాటు తెల్లపాలెం గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>