ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల వివాదంపై సుప్రీం కీలక తీర్పు!

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్‌లోని 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల (AP Municipal Elections) ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తాత్కాలికంగా నిలిపివేసింది. పురపోరులో నామినేషన్లు దాఖలు చేయకుండా తమ అభ్యర్థులను భయాందోళనలకు గురిచేసి అడ్డుకున్నారని, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అత్యున్నత స్థాయి స్పందనను వ్యక్తం చేసింది.

అక్రమాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల ఆధారంగా నామినేషన్ దాఖలు గడువును పొడిగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బాధితుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఆధారాలను కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఎస్‌ఈసీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకునేవరకు సదరు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆఖరి జాబితాను విడుదల చేయవద్దని సూచించింది.

న్యాయస్థాన ఆదేశాలకు అనుగుణంగా స్పందించిన ఏపీ ఎన్నికల సంఘం, ప్రభావితమైన 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ తదుపరి దశలను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచింది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల భద్రతను సమీక్షిస్తూ ఫిర్యాదుల ఆధారంగా తగిన చర్యలు చేపట్టేందుకు ఈసీ సిద్ధమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>