కలం, నిర్మల్: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, అమరవీరులకు నివాళులర్పించారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని రక్షిస్తే, రాష్ట్రంలో అంతర్గత భద్రతను కాపాడుతూ ప్రజలకు భరోసా కల్పించేది పోలీసులని అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల రక్షణలో పోలీసులు అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారని, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : నామినేటెడ్ పోస్టుల్లో నిరాశ..!
Follow Us On: X(Twitter)

