కలం, వెబ్ డెస్క్ : ఏపీ మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల ప్రక్రియలో హింస జరిగినట్లు వైసీపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం విచారించింది. నామినేషన్లు అడ్డుకున్నారని, నామినేషన్ల గడువును పొడిగించాలన్న వినతిని న్యాయస్థానం నిరాకరించింది. అయితే, వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన 19 ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ 19 ప్రాంతాల్లో నామినేషన్లను స్వీకరించాలా వద్దా? అన్న తుది నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వివాదాస్పదమైన స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియను మళ్లీ చేపట్టాలా లేదా అనే అంశంపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ(SEC)కి సూచించింది. ఈరోజు (బుధవారం) అభ్యర్థి జాబితా ప్రకటించాల్సి ఉండగా ఈ నెల 25వ తేదీ వరకు ప్రకటించవద్దని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఆ ప్రాంతాల్లో తీసుకునే నిర్ణయాన్ని బట్టి అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయాలని సూచించింది.
ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై ఈ నెల 27 నాటికి పూర్తి స్థాయి సమగ్ర స్టేటస్ వివరాలను తమ ఎదుట దాఖలకు చేయాలని ఏపీ ఎస్ఈసీ కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చివరగా, ఈ మొత్తం వ్యవహారంపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత స్థితిగతులపై ఈ నెల 27వ తేదీ నాటికి పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్టును తమ ఎదుట దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ఆదేశించింది.
Also Read : రప్పారప్పా అంటూ వేధిస్తే తాటతీయాలి.. చంద్రబాబు వార్నింగ్
Follow Us On: Youtube

