ఖానాపూర్‌–నిర్మల్‌ బస్సులో ప్రమాదం.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు

కలం, ఖానాపూర్: ఖానాపూర్ నుంచి నిర్మల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు (Khanapur–Nirmal RTC Bus) లో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వృద్ధురాలు గాయపడింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఖానాపూర్ నుంచి నిర్మల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొమ్మోజి లక్ష్మి అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు బస్సులో నుంచి జారిపడింది.

ఈ ఘటనలో ఆమె కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శేఖర్, పైలట్ విజయ్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వృద్ధురాలికి ప్రాథమిక సహాయం అందించి, చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు.

Also Read : పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>