కలం, వెబ్ డెస్క్ : రప్పారప్పా అంటూ ప్రజలను వేధిస్తున్న వారి తాట తీయాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) పోలీసులకు సూచించారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరవీరులను నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ రక్షణకు భంగం కలిగే చర్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారని చంద్రబాబు కొనియాడారు.
భద్రతా వ్యవస్థ(Security System)పై నమ్మకం ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని సీఎం తెలిపారు. పోలీసులు ఉంటేనే సమాజంలో శాంతిభద్రతలు ఉంటాయన్నారు. పోలీసులంటే నేరస్తులకు భయం, బాధితులకు నమ్మకం కలగాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసేవాళ్లు, రౌడీలు, సోషల్ మీడియా సైకోలను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎప్పుడూ టాప్ లో ఉంటారని దేశమంతా అనుకోవాలని ఆయన (Chandrababu) పేర్కొన్నారు.
Also Read : ఇచ్చాపురంలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన ప్లాస్టిక్ గోదాం!
Follow Us On : WhatsApp

