రాజస్థాన్ లో దారుణం.. ప్రియుడి కోసం కన్నపేగునే తెంచుకున్న తల్లి

కలం, వెబ్ డెస్క్ : ప్రియుడితో మోజులు పడ్డ ఒక తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్నపేగు బంధాన్నే మరిచి తన పెళ్లికి అడ్డంకిగా మారారని కారణంతో కవల కుమారులను హత్య చేసింది. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ (Rajasthan Tragedy) లోని డీగ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలం క్రితం భర్త మరణించడంతో ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఆ సమయంలో పొరుగున ఉండే ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

అయితే, మహిళకు పిల్లలు ఉండడంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో తమ బంధానికి పిల్లలు అడ్డొస్తున్నారని భావించిన ఆమె, వారిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరు పిల్లలను హత్య చేసి స్థానికంగా పొలంలో వదిలేసి వెళ్లింది. దసరా రోజు ఉదయం మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.

ఆరు గంటల్లోనే నిందితురాలైన తల్లిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పిల్లల హత్యకు సంబంధించింది మరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Also Read : పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>