‘పంత్ మార్చాల్సింది ఆట కాదు.. ఆలోచన’

కలం, స్పోర్ట్స్ : భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant) టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక సూచన చేశారు. తన సహజమైన ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదని, అయితే మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని తెలివిగా ఆడాలని సూచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ స్థానం ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పంత్ అపార ప్రతిభ ఉన్న ఆటగాడని శాస్త్రి అభిప్రాయపడ్డారు. అతడు తనదైన శైలిలో ఆడుతూనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

దూకుడైన ఆటను పూర్తిగా మార్చుకోవడం కంటే, ఎప్పుడు దూకుడుగా ఆడాలి.. ఎప్పుడు సంయమనం పాటించాలనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో పంత్‌కు ప్రాధాన్యం కొనసాగుతోంది. అయితే వన్డేలు, టీ20ల్లో మాత్రం అతడి స్థానం బలహీనపడింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కూర్పు జరుగుతున్న సమయంలో పంత్ వన్డే ప్రణాళికల్లో కనిపించడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడలేమి పంత్ స్థానం తగ్గడానికి ప్రధాన కారణంగా మారింది.

కీలక సమయాల్లో అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్ కోల్పోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. టెస్టుల్లో అతడి దూకుడు ఎన్నోసార్లు జట్టుకు ఉపయోగపడినా, వన్డేలు, టీ20ల్లో మాత్రం అదే విధానం కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా మారుతోంది. మరోవైపు వికెట్‌కీపర్ బ్యాటర్ స్థానానికి పోటీ కూడా పెరిగింది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు జట్టులో తమ అవకాశాల కోసం పోటీపడుతున్నారు. వారి నిలకడ, వివిధ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగల సామర్థ్యం పంత్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>