ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్‌.. కవిత శుభాకాంక్షలు

కలం, వెబ్‌డెస్క్ : వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను (Nalamasa Srekanth Goud) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్‌కు కవిత(Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కృషి, నాయకత్వ లక్షణాలు, దార్శనికత ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమన్వయం కోసం తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకుడు సయ్యద్‌ను స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా నియమించారు. ఎన్నికల ప్రచారం, సమన్వయ కార్యక్రమాల నిర్వహణలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>