కలం, సోన్: సోన్ మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి శోభాయాత్రలు (Durga Mata Procession) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కడ్తాల్(Kadthal) గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్ఠించి, భాజాభజంత్రీలు, భక్తుల కోలాహలం నడుమ గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు. యువతులు, చిన్నారులు బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

