కలం, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 24 నాటికి అల్పపీడనం మరింత బలపడే అవకాశం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఈనెల 26 తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈనెల 29, 30న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

