బంగల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రీహరి రావు ప్రత్యేక పూజలు

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Srihari Rao ) సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. దసరా పండుగ సందర్భంగా మంగళవారం అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, కౌన్సిలర్ పెండెం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పూదరి అరవింద్, నాందేడపు చిన్ను తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>