ఫుట్‌పాత్‌ల నిర్వహణపై కలెక్టర్‌కు ఆప్ ఫిర్యాదు

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal)పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, వాకింగ్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2024 నుంచి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. షాపింగ్ మాల్స్‌ వల్ల ఫుట్‌పాత్‌లపై అడ్డంకులు ఏర్పడి ప్రజలు రోడ్లపై నడవాల్సి వస్తోందని తెలిపారు. ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి కేటాయించిన రూ.6 కోట్ల నిధుల వినియోగంపై విచారణ జరిపించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌ వినోద్, అబ్దుల్ సాధిక్, రవి, వసంత్ రావు, మెరుగు రాజన్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>