నిర్మల్‌లో ఆయుధ పూజ.. పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్‌: దసరా నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్‌ (Ayudha Pooja Nirmal) జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయుధపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆయుధాలు, పోలీస్‌ వాహనాలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం హెడ్‌క్వార్టర్స్‌ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. దసరా నవరాత్రుల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆయుధపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్‌ శాఖలో ఆయుధాలు, వాహనాలు విధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>