వైసీపీ నాయకులే రోడ్డును ధ్వంసం చేశారు: మంత్రి లోకేశ్

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలోని ఓ గ్రామంలో ప్ర‌భుత్వం నిర్మించిన కొత్త రోడ్డును వైసీపీ నాయ‌కులు ధ్వంసం చేశారంటూ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం – పాపక్కగారిపల్లె (Ananthasamudram – Papakkagari Palle) గ్రామాల మ‌ధ్య‌ ఇటీవల రూ. 4.75 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ నూతన తారు రోడ్డును వైసీపీ నాయకులు ట్రాక్టర్‌తో తవ్వి ధ్వంసం చేశార‌ని నారా లోకేష్ ఆరోపించారు. రోడ్డు నిర్మించిన కేవలం నాలుగు రోజులకే ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడటం అత్యంత సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రోడ్డును ఈ విధంగా నాశనం చేయడం రాజకీయం కాదని, ఇది ప్రజల సౌకర్యాలపై చేసిన అహంకారపూరిత దాడి అని ధ్వజమెత్తారు.

ప్రజా ఆస్తులను నష్టం కలిగించేలా ప్రవర్తించిన బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని లోకేష్ (Nara Lokesh) కోరారు. తక్షణమే ఈ ఘటనకు కారణమైన వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. అలాగే త్వరితగతిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే సంస్కృతిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read : సుప్రీం కోర్టులో వైసీపీ అత్యవసర పిటిషన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>