మడకశిరలో జనసేనకు బిగ్ షాక్.. అసలేం జరిగింది?

కలం, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర (Madakasira Janasena) నగర పంచాయతీ స్థానిక ఎన్నికల బరిలో ఉన్న జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నగర పంచాయతీ ఛైర్మన్ పదవికి జనసేన తరఫున రేసులో నిలిచిన అభ్యర్థి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. శ్రీనివాసరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన మొత్తం నాలుగు నామినేషన్లను కూడా అధికారులు తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

నామినేషన్ల పరిశీలన సందర్భంగా జనసేన అభ్యర్థి సమర్పించిన పత్రాలపై పోటీలో ఉన్న ఇతర 9 మంది ఛైర్మన్ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాల్లోని పలు కీలక విభాగాలను, నిబంధనల ప్రకారం పూర్తి చేయకుండా ఖాళీగా వదిలేశారని ప్రత్యర్థి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల అధికారులు, దరఖాస్తుల్లో సాంకేతిక లోపాలు, ఖాళీలు ఉన్న విషయాన్ని ధ్రువీకరిస్తూ నామినేషన్లను రద్దు చేశారు.

ఈ నిర్ణయంతో మడకశిరలో జనసేన శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యాయి. ఎన్నికల అధికారుల నిర్ణయంపై జనసేన న్యాయవాది రాజ్ కమల్ స్పందిస్తూ.. నియమావళికి విరుద్ధంగా తమ అభ్యర్థి నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>