కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బంది ఆయుధ పూజను (Ayudha Pooja) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపించారు.
ఆలయ భద్రతను మరింత పటిష్ఠం చేయడంతోపాటు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన రక్షణ కల్పించాలనే సంకల్పంతో SPF సిబ్బంది స్వామివారి ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జె. భవాని శంకర్, టీజీ ఎస్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ (CSO) కే. శేషగిరిరావు, ఆలయ అధికారులు, హోంగార్డులు, SPF సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు
Follow Us On: Youtube

