కిమ్ జోంగ్‌కు ‘బ్రెయిన్ డెడ్’.. అస‌లు నిజం ఇదే!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్తర కొరియా (North Korea) సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మెదడులో రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లాడ‌ని, ఆ తర్వాత చ‌నిపోయాడ‌ని సోషల్ మీడియా వేదికగా మరోసారి విపరీతంగా ప్రచారం జరుగుతోంది. చైనా డెమోక్రసీ పార్టీ అధ్యక్షుడితో పాటు కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ఈ పోస్టులను విపరీతంగా షేర్ చేయడంతో కిమ్ ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. కిమ్ (Kim Jong Un) పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం చైనాకు చెందిన బీజింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యుల బృందాన్ని పంపారని, కానీ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారంటూ అనేక రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ గానీ, ఆధారాలు గానీ లేవు. ఈ తరహా ప్రచారాలు కేవలం ఆధారాలు లేని పుకార్లేనని స్పష్టమవుతోంది. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థల నివేదికల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఇటీవల పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అక్టోబర్ 13న డబ్ల్యూపీకే 81వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన నేషనల్ డిఫెన్స్ రివాల్యూషన్ మ్యూజియం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న దృశ్యాలు కూడా వెలువడ్డాయి. దీంతో కిమ్ మరణించారంటూ జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానాలే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలింది.

Also Read : చ‌ర్చిలో త‌ల‌పై శిలువ ప‌డి ఫాద‌ర్ మృతి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>