బతుకమ్మ వేడుకల్లో కుల వివక్ష.. ములుగులో కలకలం!

కలం, ములుగు: సద్దుల బతుకమ్మ వేడుకల్లో కుల వివక్ష చోటుచేసుకున్న ఘటన ములుగు (Mulugu) జిల్లాలో కలకలం రేపింది. ఏకగ్రీవంగా ఎన్నికైన దళిత మహిళా సర్పంచ్‌ మడిపల్లి రాజేశ్వరి కుమార్‌ను బతుకమ్మ ఆడేందుకు అనుమతించకుండా కొందరు మహిళలు అవమానించారు. వెంకటాపూర్‌ మండలం నర్సింగాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సర్పంచ్‌ రాజేశ్వరి కుమార్‌ తన బంధువులు, గ్రామస్తులతో కలిసి సద్దుల బతుకమ్మను ఎత్తుకొని వేడుకలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొందరు మహిళలు దళితులు బతుకమ్మ ఆడే ప్రాంతంలో ఆడొద్దంటూ అభ్యంతరం తెలిపి అవమానించినట్లు ఆరోపించారు. పండుగ వేళ అందరూ కలిసి సంబరాలు జరుపుకోవాల్సి ఉండగా, కులం పేరుతో వివక్ష చూపడం బాధాకరమని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయం చేయాలని డిమాండ్‌

ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వెంటనే నర్సింగాపురం బతుకమ్మ వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పినట్లు తెలిసింది. సోమవారం ఉదయం బాధిత సర్పంచ్‌ ఈ విషయాన్ని దళిత సంఘాల నాయకుల దృష్టికి తీసుకెళ్లి, తనకు న్యాయం చేయాలని కోరారు. గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>