ప్రజావాణి ఫిర్యాదులు వేగంగా ప‌రిష్క‌రించాలి

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ (Nizamabad) అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతో పాటు ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్డీఓ సాయన్న, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>