కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల శ్రీ హరి హర త్రిశక్తి క్షేత్రం (Trishakti Temple) లో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా త్రిశక్తి క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకము, లలిత పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిన్నూరి గోపాలకృష్ణ, సాగి కమలాకర శర్మ, అనురాధ, మనోహరి శ్రీనివాస్ గుప్తా, పంతులు దత్తాత్రేయ శర్మ, ప్రమోద్ కుమార్, రాకేష్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.

