కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ చరిత్ర త్యాగాలతో ముడిపడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కొనియాడారు. హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) సద్భావనా యాత్ర స్మారక సమితి ఆధ్వర్యంలో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అభివర్ణించారు.
చార్మినార్‌తో రాజీవ్ గాంధీకి విడదీయలేని అనుబంధం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. దేశం కోసం తన ప్రతి రక్తపు బొట్టును ధారపోస్తానని చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని కొనియాడారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారని తెలిపారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అని పేర్కొన్నారు. నేడు దేశ ప్రజలు మొబైల్ ఫోన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంలో ఆయన దూరదృష్టి కీలక పాత్ర పోషించిందని అన్నారు.
Also Read : చర్చిలో తలపై శిలువ పడి ఫాదర్ మృతి!
Follow Us On: Youtube

