కలం, వనపర్తి: వనపర్తి జిల్లా రాజాపేట గ్రామానికి చెందిన గద్వాల గోవింద్ (Gadwala Govind) తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లో జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. గోవింద్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన నేపథ్యంలో హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ తన మిత్రబృందంతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గోవింద్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో న్యాయమూర్తిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగేలా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు కృషి చేయాలని అభిలాష్ హౌదేకార్, ఆయన మిత్రులు సూచించారు. రాజాపేట గ్రామానికి చెందిన గోవింద్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో అడ్వకేట్లు రవి, భైరవ రెడ్డితో పాటు పలువురు పాల్గొని గోవింద్‌ను అభినందించారు.

