దసరా ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం (Bangalpet Temple) లో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy) అధికారులను ఆదేశించారు.

సోమవారం బీజేపీ కౌన్సిలర్లతో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. వినాయక్ సాగర్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ దీపాలను అమర్చాలని సూచించారు.

అలాగే మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే మహిషాసుర దహనం, దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్యే మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్, కూన శశాంక్, రావులవారి విట్టల్, సూరజ్ నాయక్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, సామ రాజేశ్వర్ రెడ్డి, జమాల్, జుట్టు దినేష్, అర్జున్, కందుల హరీష్, గిల్లి విజయ్, శ్రీనివాస్, గణేష్, భరత్‌, వీహెచ్‌పీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>