కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా దసరా వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుధ పూజ, జమ్మి పూజ, వాహన పూజ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Police Commissioner Gaush Alam) ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు (Dasara Celebrations) భక్తిశ్రద్ధలతో సాగాయి. ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు నిర్వహించి పండుగ సంప్రదాయాలను పాటించారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ ..కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు జానీమియా, శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పండుగ సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సందడి నెలకొంది. అధికారులు, సిబ్బంది పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>