టైగర్ ష్రాఫ్ హత్యకు కుట్ర.. ముగ్గురు నిందితులు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) పై కాల్పుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడి హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో పూణే–జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

ముంబై పోలీసులు అందించిన సమాచారంతో రాజస్థాన్ యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్, కోటా సిటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల వివరాల ఆధారంగా.. పట్టుబడిన వారిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు బీహార్‌కు చెందిన ఒకరు ఉన్నట్లు గుర్తించారు. సోనిపట్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్, రెహాన్ (18) బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన హృతిక్ కుమార్ (22) ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో నివసిస్తున్న హృతిక్ కుమార్ రాపిడో రైడర్‌గా పనిచేస్తున్నారు.

ముగ్గురిలో ఇద్దరు టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) ని హత్య చేసేందుకు నియమితులయ్యారని, దాడి అనంతరం వారు తప్పించుకునేందుకు మూడో వ్యక్తి సహకరించాల్సి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల పాత్ర, ముఠాతో ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read : జాతీయ స్టాక్ మార్కెట్లపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>