సిద్ధిధాత్రి అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన సరస్వతి

కలం, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ (దసరా) శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు సోమవారం అమ్మవారు సిద్ధిధాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధిధాత్రి దేవి భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిగా పూజలందుకుంటారు.

‘సిద్ధి’ అంటే కార్యసిద్ధి, ‘ధాత్రి’ అంటే ప్రసాదించేది అని అర్థం. ఇహలోక సుఖాలతో పాటు జ్ఞానం, మోక్షాన్ని కూడా ప్రసాదించే శక్తి స్వరూపిణిగా సిద్ధిధాత్రి దేవిని భక్తులు ఆరాధిస్తారు. తామరపువ్వుపై ఆసీనురాలైన ఈ అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో కమలం, గద, సుదర్శన చక్రం, శంఖం ధరించి దర్శనమిస్తారు.

సిద్ధిధాత్రి దేవిని ఆరాధించడం వల్ల బ్రహ్మజ్ఞానం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. మానవులతో పాటు సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు సైతం ఈ అమ్మవారిని పూజిస్తారని ప్రతీతి. సిద్ధిధాత్రి దేవిని భక్తిశ్రద్ధలతో ఉపాసించే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>