కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిధిలో అగ్నిప్రమాదం (Charminar Fire Accident) చోటు చేసుకుంది. మదీనా రోడ్డులోని బాంబే హౌసరీలో సోమవారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళను గురయ్యారు. భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

