రైతుల కన్నీళ్లకు కాంగ్రెస్ పాలనే కారణం: వద్దిరాజు

కలం, ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు పాలన చేతకావడం లేదని మండిపడ్డారు.

సూపర్ ఎల్‌నినో గురించి ఏడాదిగా నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదని, పాలకుల ముందుచూపు లోపం వల్ల గోదావరి, కృష్ణా నదుల వరదలను ఒడిసిపట్టలేక రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు, కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, యాసంగి సాగు చేయొద్దని మంత్రులే చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే, కాంగ్రెస్ నాయకులు అసూయతో నీళ్లు లేకుండా చేశారని విమర్శించారు.

ఇదిలా ఉంటే, కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి నీళ్లు మళ్లించుకుపోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎంపీ వద్దిరాజు తీవ్రంగా ఖండించారు. ఈ వార్తను వెంటనే ఉపసంహరించుకుని కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రజలకు ఆ పత్రిక సంపాదకుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్ చట్టపరంగా ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>