బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ గోడం నగేష్

కలం, బాసర : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఎంపీ గోడం నగేశ్ (MP Godam Nagesh ) ఆదివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అర్చకుల ఆధ్వర్యంలో ఆయనకు అమ్మవారి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈవోతో కలిసి ఎంపీ పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాసర మండల బీజేపీ అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్, మాజీ సర్పంచ్ సతీష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>