కూట‌మి ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ ఫిర్యాదు

క‌లం, వెబ్‌డెస్క్‌: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) నేడు విజయవాడలోని లోక్‌భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార కూటమి నేతలు దౌర్జన్యాలు, బెదిరింపులు, అప్రజాస్వామిక విధానాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పులివెందుల‌తో పాటు పలు ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, పత్రాలను చించివేయడం వంటి ఘటనలు జ‌రిగాయ‌ని వివరించారు. పులివెందులలో 36 వార్డులకు గాను కేవలం 19 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయని, అలాగే దాచేపల్లి, దర్శి, జమ్మలమడుగు, పుంగనూరు, తిరుపతి, రాయచోటి, రాజంపేట, కమలాపురం, ఆదోని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనే జరిగాయని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని ఆయన గవర్నర్‌ను కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి పట్ల వ్యవహరించిన తీరును ప్ర‌స్తావించారు. పోలీసుల ఏకపక్ష ధోరణి, పార్టీ శ్రేణులపై పెట్టిన కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం అవసరమైతే అన్ని న్యాయపరమైన మార్గాలను కూడా అనుసరిస్తామని జగన్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>