శ్రీ బోజ్జవరి ఆలయంలో కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు!

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో వెలసిన ప్రసిద్ధ శ్రీ బోజ్జవరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్‌కు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>