మోకాళ్లపై కూర్చొని NHM ఉద్యోగుల నిరసన

కలం, నాగర్‌కర్నూల్: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల (NHM Employees) న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌లోని సమ్మె శిబిరం వద్ద ఎన్ హెచ్ ఎం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రధాన డిమాండ్ల సాధనకు పట్టు

ఏళ్లుగా ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు మంజూరు చేయడంతోపాటు 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

న్యాయం జరిగే వరకు పోరాటం

“మోకాళ్లపై మా నిరసన.. న్యాయం జరిగే వరకు మా పోరాటం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా.బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ బాషా, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ డా. జగన్, కల్చరల్ సెక్రటరీ డా.రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ భీముడు, కోశాధికారి ప్రవీణ్‌తో పాటు పలువురు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>