విజ‌య‌వాడ మేయ‌ర్ రేసులో మాజీ ఐపీఎస్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి ఏబీ వేంక‌టేశ్వ‌ర రావు (AB Venkateswara Rao) స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌య‌వాడ మేయ‌ర్ (Vijayawada Mayor) బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నేడు ఆయ‌న నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఏబీ వేంక‌టేశ్వ‌ర రావు గతంలో రెండుసార్లు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. ఆయనకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు చెప్తున్నారు. టీడీపీలోని కొందరు నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మేయర్ ఎన్నికలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

మరోవైపు జనసేన తరఫున వంగవీటి రాధా, వైసీపీ తరఫున బీసీ మహిళా నేత రాయన భాగ్యలక్ష్మి బరిలో ఉన్నారు. ఏబీ వేంకటేశ్వరరావు పోటీకి దిగడంపై జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఆయనకు తన సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తే విజయవాడ మేయర్ (Vijayawada Mayor) ఎన్నికలో తీవ్ర‌ పోటీ నెలకొనే అవకాశం ఉంది. గంటగంటకూ మారుతున్న రాజకీయ పరిణామాలతో విజయవాడ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

Also Read : వచ్చేది మా ప్రభుత్వమే.. నేనే హోంమంత్రి : అంబటి కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>