అవును.. మేం తప్పు చేశాం: జగన్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) నియామకంలో వెంటనే సంస్కరణలు రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) స్పష్టం చేశారు. గతంలో సీఈసీ సెలక్షన్ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ ఉండేవారని.. ఇప్పుడు సీజేఐ స్థానంలో ప్రధాని ప్రతిపాదించే మంత్రి ఉన్నారని వివరించారు. ఈ ప్రతిపాదనకు అప్పట్లో తాము కూడా అంగీకరించి తప్పు చేసినట్లు అంగీకరించారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన కమిటీ మాత్రమే సీఈసీని ఎంపిక చేయాలన్నారు.

రాష్ట్రంలో కూడా అలాగే..

రాష్ట్రంలో ఎన్నికల సంఘం కమిషనర్‌ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, హైకోర్టు సీజేతో కూడిన కమిటీ ఎన్నుకోవాలన్నారు. ఎన్నికల కమిషనర్లను అధికారంలో ఉన్నవారే ఎంపిక చేసుకునే పరిస్థితులు ఉండొద్దన్నారు. అందుకే మార్పు రావాలని వైసీపీ బలంగా కోరుతోందన్నారు. ఎన్నికల వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందన్నారు. కాగా, సీఈసీ నియామకంపై జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Also Read : ఏపీలో నారాసుర రక్తచరిత్ర : వైఎస్ జగన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>