వనపర్తిలో ‘వివేకానంద క్రికెట్ టోర్నీ సీజన్‌–1’ ప్రారంభం

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలో ‘వివేకానంద క్రికెట్ టోర్నమెంట్ సీజన్‌–1’ ఆదివారం ప్రారంభమైంది. హిందూ వాహిని ఆధ్వర్యంలో, బీజేపీ నాయకుల సహకారంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని ఛత్రపతి శివాజీ ప్రాంగణంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం, సేవా సంకల్పానికి గుర్తుగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు.

ప్రారంభోత్సవానికి వనపర్తి జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి. నారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, కేతురి బుడ్డన్న, జిల్లా అధికార ప్రతినిధి గజరాజుల తిరుమలేశ్, సామాజిక సేవా కార్యకర్త గంధం నాగరాజు, హిందూ వాహిని జిల్లా కన్వీనర్ అరుణ్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు బోలమోని మణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతోపాటు, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో హిందూ వాహిని ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువ క్రీడాకారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>